గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఇసుక వాగు పొంగి ప్రవహిస్తోంది. బుధవారం సాయంత్రం తాటి నరసింహారావు తన గ్రామానికి వాగు దాటి వెళ్తుండగా గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న భద్రాచలం సబ్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అచూకీ కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారు జామున ఇసుకవాగులో చెట్ల మధ్య నరసింహారావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. తాటి నరసింహారావు మృతిచెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వాగులో గల్లంతైన వ్యక్తి మృతి - gallanthuaina
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఏలకల గూడెం గ్రామం వద్ద ఇసుక వాగులో గల్లంతైన తాటి నరసింహారావు మృతి చెందాడు.
వాగులో గల్లంతైన వ్యక్తి మృతి