తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల్లో మారుతున్న తీరు.. కరోనా మృతులకు అంత్యక్రియలు - కరోనా మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు తాజా వార్త

కొవిడ్ మరణం అనగానే ఎవరు దగ్గరికిరాలేని పరిస్థితి మొదట్లో ఉండేది. రానురాను ప్రజల్లో అవగాహన రావడం మొదలైంది. కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లోనూ సహకారం అందుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకుందాపురంలో ఓ వ్యక్తి అంత్యక్రియలు చూస్తే ఇది నిజమనిపిస్తోంది.

Funeral of the man who died with Corona at mukundapuram in bhadradri kothagudem district
గ్రామాల్లో మారుతున్న తీరు.. కరోనా మృతులకు అంత్యక్రియలు

By

Published : Sep 5, 2020, 2:13 PM IST

కొవిడ్​ బారినపడి మృతి చెందిన తమ తండ్రి పార్థివదేహానికి దూరం నుంచే రోదిస్తూ కూతుర్లు కంటతడి పెట్టిన ఘటన గ్రామస్థులను సైతం బాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి కొవిడ్​ సోకడం వల్ల వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించారు. అతని పార్థివ దేహాన్ని గ్రామానికి తీసుకురాగా తమ తండ్రి కడసారి చూపును కూడా ఆ కూతుర్లు దూరం నుంచే చూసుకోవాల్సి రావడం.. ఆఖరి స్పర్శకు దూరం కావడం గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించింది.

గ్రామాల్లో మారుతున్న తీరు.. కరోనా మృతులకు అంత్యక్రియలు

అంత్యక్రియలను కొవిడ్ నిబంధనలతో పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బందే చేపట్టారు. కరోనా అంతక్రియలు అంటే దూరం నుంచి చూసే పరిస్థితి నుంచి వారికి సహాయం చేసే పరిస్థితి గ్రామాల్లోనూ రావడం అభినందనీయమని సర్పంచ్,​ కార్యదర్శిని గ్రామస్థులు అభినందించారు.

ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details