భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో సహకార ఎన్నికల ఉప సంహరణలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అధికార తెరాసలోని రెండు వర్గాలు ఉపసంహరణకు పోటీపడ్డారు. ఓ వర్గం వద్దని, మరో వర్గం ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను లాగటం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
నాటకీయంగా సహకార ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణల పర్వం - సహకార సంఘాల నామినేషన్ల ప్రక్రియ
ఓ వర్గమేమో ఉపసంహరించుకొమ్మని... మరో వర్గమేమో వద్దని... తోపులాటల మధ్య ఉపసంహరణ పర్వం ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
![నాటకీయంగా సహకార ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణల పర్వం FRICTION BETWEEN TWO GROUPS IN PACS NOMINATION WITHDRAWAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6028965-thumbnail-3x2-pppp.jpg)
FRICTION BETWEEN TWO GROUPS IN PACS NOMINATION WITHDRAWAL
ఓ అభ్యర్థి ఉపసంహరించుకునేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా మరో వర్గం నాయకులు అతన్ని బలవంతంగా బయటకు లాక్కొని వెళ్లారు. అప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకున్న తెరాస... మరో వార్డు ఏకగ్రీవం చేస్తే ఛైర్మన్ పదవికి సరిపడా సభ్యులతో మెజార్టీలో ఉండేది. అలా కాకుండా ఉప సంహరణ ముగిసే ముందు ఒకరిని బయటకు లాక్కెళ్లటం వల్ల ఫలితాలు తారుమారయ్యాయి. సొసైటీ కార్యాలయం వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారగా... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాటకీయంగా సహాకార ఎన్నికల నామినేషన్ల ఉపసంహణ పర్వం
ఇదీ చూడండి:వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం
Last Updated : Feb 11, 2020, 7:37 AM IST