ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. కేవలం నిత్యం జరిగే పూజలు మాత్రం నిర్వహిస్తూ భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.
కరోనా ఎఫెక్ట్: ఉచితంగా భద్రాద్రి రామయ్య లడ్డూ పంపిణీ
కరోనా వైరస్ ప్రభావం భద్రాద్రి రామయ్య ప్రసాదంపై కూడా పడింది. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తూ.. స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూని ఉచితంగా పంపిణీ చేశారు.
కరోనా ఎఫెక్ట్: భద్రాద్రి రామయ్య ప్రసాదం ఉచిత పంపిణీ
ఆలయం మూసివేయడం వల్ల సుమారు 18 వేల లడ్డూ ప్రసాదాలు మిగిలిపోయాయి. దీనితో ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.4 లక్షల విలువ గల 18,000 లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు.