భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు(Maoist militia members) లొంగిపోయారు. వీరంతా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. లొంగిపోయిన వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
చర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులను.. సమావేశాలకు హాజరు కావాలని, నిత్యావసర వస్తువులు అందించాలని మావోయుస్టులు డిమాండ్ చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేకనే తప్పనిసరి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహాయం చేశారని వివరించారు. అందుకే ప్రశాంత జీవనాన్ని కొనసాగించేందుకు వీరంతా లొంగిపోయారని పేర్కొన్నారు.