తెలంగాణ

telangana

ETV Bharat / state

Maoists surrender: నలుగురు మావోయిస్టుల లొంగుబాటు - నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

Four Maoists surrender before Charla police in Bhadradri district
Four Maoists surrender before Charla police in Bhadradri district

By

Published : Nov 6, 2021, 7:51 PM IST

Updated : Nov 6, 2021, 8:40 PM IST

19:50 November 06

Maoists surrender: నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ- ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలోని చర్ల ఏరియాలో గల రాళ్లపురం, కొండవాయి, చెన్నాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు లొంగిపోయారు. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా ఉన్న ఈ నలుగులు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ ఎదుట లొంగిపోయారు. 

వీళ్లు చాలా కాలం నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు పెడుతున్న వేధింపులు భరించలేకే జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వాళ్లు తెలిపారని పేర్కొన్నారు. మిగతా మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛా జీవితం గడపాలని ఏఎస్పీ కోరారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 6, 2021, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details