ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేఎం బంజార్ నుంచి సత్తమ్మ గుడి వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రహదారి మధ్యలో ఉన్న కట్టలేరు వాగుపై వంతెన నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - రహదారికి శంకుస్థాపన చేసిన సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం జిల్లా కేఎం బంజార్లో రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషిని కొనసాగిస్తాన్నారు. విడుదలైన రూ.100 కోట్ల సింగరేణి నిధుల్లో రూ.15.35 కోట్లు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కేటాయించిట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తన్నీరు కృష్ణవేణి, జడ్పీటీసీ సభ్యుడు చిత్రాలు మోహన్ రావు, వైస్ ఎంపీపీ కస్తూరి, ఎంపీటీసీ సభ్యురాలు రావూరి రత్నకుమారి పాల్గొన్నారు.
రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల