సీఎం చెప్పిన పంటలే వేస్తామని ప్రతిజ్ఞ చేసిన రైతులు - Cm KCR Agriculture Programme
రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ప్రకారం నడుచుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం గ్రామ రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు రైతులచే తెరాస నాయకులు ప్రతిజ్ఞలు చేయించారు.
![సీఎం చెప్పిన పంటలే వేస్తామని ప్రతిజ్ఞ చేసిన రైతులు Former's Pledge On Cm Crop Suggestion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:48-tg-kmm-16-21-saagupai-cmsuchanakusammatham-ab-ts10145-21052020154041-2105f-01882-704.jpeg)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామ రైతులు సాగుపై ముఖ్యమంత్రి మాటను ఆనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు రాకముందే గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు రైతులతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఈసారి తమ నేలల్లో మొక్కజొన్న కాకుండా.. ప్రభుత్వ వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు పండిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. వ్యవసాయ రంగం మీద సమగ్ర అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటపై నిలబడుతామని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. ఒడ్డుగూడెం ఎంపీటీసీ లింగమ్మ, సర్పంచ్ భాగ్యమ్మ, రైతు కమిటీ సభ్యులు కృష్ణయ్య, సహకార సంఘం ఛైర్మన్ బండారి శ్రీను తదితరులు ఈ రైతు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.