భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య పలువురు అన్నదాతలను సన్మానించారు.
అన్నదాతలను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి - AIKSCC honored farmers
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు.
bhadradri kothagudem district latest news
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరతతోపాటు వాహనాలు రాకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్కారు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. అలాగే చెల్లింపులు కూడా వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నేతలతోపాటు ఇతర వామపక్ష పార్టీ నాయకులు ఏపూరి బ్రహ్మం శోభన్, నబి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.