తెలంగాణ

telangana

ETV Bharat / state

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల - వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల

సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్​ పోటీలను స్థానిక నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు.

Tummala Nageswara Rao initiated volleyball competitions
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల

By

Published : Apr 11, 2021, 4:37 PM IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహభావాన్ని పెంపొదిస్తాయని తెరాస నేత, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్​ పోటీలను స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపు వరంగల్​కు కేటీఆర్​.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details