భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని సుదిమల్ల బాలాజీనగర్ ఇందిరా నగర్ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కందకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. అర్బన్ పార్కు కోసం రైతుల భూముల నుంచి వెళ్లే కందకం పనులను ఇటీవల జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య రైతులతో కలిసి అడ్డుకున్నారు. నాలుగు రోజుల విరామం అనంతరం అటవీ శాఖ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో 3 జేసీబీ యంత్రాలతో పనులను ముగించారు.
కందకం పనులు పూర్తి చేసిన అటవీ శాఖ అధికారులు - badradri district latest news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుదిమల్ల బాలాజీనగర్ ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన కందకం పనులు పూర్తయ్యాయి. స్థానికులు ఇటీవల పనులను అడ్డుకోగా.. నాలుగు రోజుల విరామం అనంతరం అధికారులు పనులను ముగించారు.
forest
అర్బన్ పార్కు కోసం రూ.75 లక్షల వ్యయంతో 2 కిలోమీటర్ల మేర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫెన్సింగ్ పనులను చేపట్టగా.. ఈ పనులతో సుదిమల్ల బాలాజీ నగర్ ఇందిరా నగర్ పంచాయతీ పరిధిలోని రైతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి.. కరోనా మరణాలతో నగర శ్మశానవాటికలకు పెరిగిన ఒత్తిడి