భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో అడవి పిల్లులు హల్చల్ చేశాయి. సారపాక పేపర్ బోర్డు ఈస్ట్ గేట్ఏరియాలో ఉన్న కొనకంచి శ్రీనివాసరావు ఇంట్లోకి ఆకస్మాత్తుగా 2 వింత ఆకారంలో ఉన్న జంతువులు దూరాయి. వాటిని చూసిన శ్రీనివాస్ కుటుంబసభ్యులు అడవి పందులు అనుకొని భయాందోళనకు గురయ్యారు.
ఇళ్లల్లోకి అడవి పిల్లులు.. భయపడ్డ జనాలు - forest cats images
అడవిలో ఉండాల్సిన పిల్లుల్లు దారితప్పి ఇళ్లలోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలోని ఓ ఇంట్లోకి అడవి పిల్లులు దూరి... భయబ్రాంతులకు గురిచేశాయి. అటవీ సిబ్బంది వాటిని బంధించి మళ్లీ అడవిలో వదిలిపెట్టారు.
forest cats enterd in to sarapaka village
అటవీ సిబ్బందికి సమాచారం అందించగా... హుటాహుటిన ఘటనస్థలికి చేరుకున్నారు. వాటిని అడవి పిల్లులుగా గుర్తించారు. స్థానికుల సాయంతో వలలో బంధించారు. వాటిని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ అడవిలోనే విడిచిపెట్టినట్లు అటవీ అధికారులు తెలిపారు.