భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ బాధితుల కోసం భోజన పంపిణీ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. క్యాంపు కార్యాలయంలో భోజనాల ఏర్పాట్లను, వంటలను ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించారు. భోజనాల ప్యాకింగ్‌లో పాల్గొన్నారు.
ఇల్లందులో కొవిడ్ బాధితులకు భోజనం - bhdradri kothagudem district news
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న బాధితుల కోసం ప్రతిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించారు. భోజనం ప్యాకింగ్‌లో పాల్గొన్నారు.

ఇల్లందులో కొవిడ్ బాధితులకు భోజనం, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
ఇటీవల కొవిడ్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.. అధైర్యపడకుండా ఉండాలని తెలిపారు. పరిస్థితి విషమించిన వారి కోసం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి భోజన వసతులు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
- ఇదీ చూడండి:ఐసీఎంఆర్ సూచనలు: ఇలా తాకండి.. అలా తినండి