భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు పెరిగిన ట్రాఫిక్ జరిమానాల పట్టికలను పలుచోట్ల ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ తెలిసేలా పలు రహదారులలో ఫ్లెక్సీలు పెట్టారు. గతంలో కంటే భారీగా పెరిగిన జరిమానాలను చూసి వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలందరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. లేనిచో పెరిగిన జరిమానాలు విధించాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఎస్సై ఎం. శ్రీనివాస్ తెలిపారు.
భద్రాద్రి రహదారులపై ట్రాఫిక్ జరిమానాల ఫ్లెక్సీలు - భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు పెరిగిన ట్రాఫిక్ జరిమానాల పట్టికలను పలుచోట్ల ఏర్పాటు చేశారు. ప్రజలందరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
భద్రాద్రి రహదారులపై ట్రాఫిక్ జరిమానాల ఫ్లెక్సీలు