భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసగుప్ప వైపునకు వెళ్లే క్రమంలో చర్ల పోలీసులు మావోయిస్టు కొరియర్లను గుర్తించి.. అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు ఐదుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని... గత నాలుగేళ్లుగా కొరియర్లుగా పనిచేస్తున్నారని ఏఎస్పీ అన్నారు.
ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్ - maoist couriers news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
![ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్ five maoist couriers arrested in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9414463-752-9414463-1604393811995.jpg)
ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్
మావోయిస్టులకు 20 మీటర్ల గ్రీన్ క్లాత్ బాంబుల తయారీలో వాడే పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఎవరైనా మావోయిస్టుల మాటలు నమ్మి వారు చెప్పిన విధంగా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'నకిలీ డాక్యుమెంట్లతో కల్యాణ లక్ష్మి నగదు కాజేసేందుకు ప్లాన్'