భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల ఎంపీడీవో కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యసొసైటీలు, మండల ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమానేశం వాడీవేడిగా జరిగింది. ఈ మేరకు మత్స్యశాఖ ఆధ్వర్యంలోని సొసైటీలపై పంచాయతీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
తగిన ఆదాయం లేదు : పంచాయతీ
పంచాయతీలకు తగిన ఆదాయం రాకుండా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆరోపించారు. చెరువులు, కుంటల వేలం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కోరారు.
నిబంధనల ప్రకారమే..
స్పందించిన జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, నిబంధనల ప్రకారమే సభ్యుల నియామకం.. చెరువులు, కుంటల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. మత్స్యసొసైటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులకే తొలి హక్కు అని.. ఇల్లెందు పూర్తి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గిరిజనులు మాత్రమే సొసైటీలకు అర్హులని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యులుగా ఎంపిక కావాలంటే ఆయా పంచాయతీ నివాసితో పాటు అదే పంచాయతీ పరిధిలోనే ప్రభుత్వ గుర్తింపు పత్రం ఉండాలని పేర్కొన్నారు.
సుమారు 10లక్షల చేప పిల్లల పంపిణీ..