రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి వర్షపాతం తగ్గుముఖం పట్టింది. క్రమంగా భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. మొదటిసారి 62 అడుగులు దాటిన గోదావరి నీరు.. రెండోసారి 55 అడుగులకు చేరింది.
భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - flood reduced to bhadrachalam godavari
భద్రాచలంలో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్ద ప్రవహిస్తుండటం వల్ల మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
అక్కణ్నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోన్న నీటిమట్టం సోమవారం ఉదయం 8 గంటలకు 43 అడుగుల వద్దకు చేరింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.