భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. ఉద్ధృతంగా గోదావరి - భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి
ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 48 అడుగులు దాటినందున అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల ఇవాళ ఉదయం 9 గంటలకు నీటి మట్టం 50 అడుగులు దాటింది. ఈ రోజు ఉదయం గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటినందున... అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు దాటితే... మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.