భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, శిరస్త్రాణం ధరించకుండా వాహనాలపై వస్తున్న వారిపై పోలీసులు జరిమానాలు విధించారు. ఇటీవల శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల మండలంలోని ఇద్దరు యువకులు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
శిరస్త్రాణం ధరించని వారికి జరిమానా - follow traffic rules
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. శిరస్త్రాణం ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు.
![శిరస్త్రాణం ధరించని వారికి జరిమానా Fines for do not follow traffic rules in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7213841-311-7213841-1589554013085.jpg)
శిరస్త్రాణం ధరించని వారికి జరిమానా
పలుమార్లు హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నా.. కొందరు పట్టణవాసులు పెడచెవిన పెట్టడం వల్ల పోలీసులు జరిమానాలు విధించడం ప్రారంభించారు. హెల్మెట్, పత్రాలు లేని వారిపై జరిమానాలు విధించారు.
ఇవీ చూడండి: మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు