తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2019, 3:51 PM IST

ETV Bharat / state

కూతురి కోసం... ప్లాస్టిక్ సీసాల్లో వ్యవసాయం

కూతురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేని సమయంలో మంచి ఆహారం అందిచాలనుకుంది ఓ తల్లి. అనుకున్నదే తడవుగా ఖాళీ ప్లాస్టిక్ డబ్బాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఔరా అనిపిస్తోంది.

farming in plastic bottles
కూతురి కోసం... ప్లాస్టిక్ సీసాల్లో వ్యవసాయం

శీతల పానీయం తాగిన తర్వాత ఖాళీ ప్లాస్టిక్ సీసాలను చెత్తకుండీలో పడవేయడం సర్వసాధారణం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని సాయినగర్​కు చెందిన మెట్ట వెంకట లక్ష్మి వాటిలోనే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తోంది.

కూతురి కోసం... ప్లాస్టిక్ సీసాల్లో వ్యవసాయం
సేకరించిన ప్లాస్టిక్ సీసాలను ఓవైపు కత్తిరించి మట్టి నింపి తాళ్లతో అడ్డంగా కట్టిన ఒక కర్రకు వేలాడదీస్తోంది. ఆ సీసాల్లోని మట్టిలో విత్తనాలు వేసి సేంద్రియ ఎరువులు వినియోగించి ఆకుకూరలు పెంచుతుంది. ఇలా పండించిన వాటితో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని లక్ష్మి తెలిపింది. తన కూతురు ఆరోగ్యం సరిగా ఉండకపోవడం వల్లనే ఈ విధమైన సాగు చేస్తున్నట్లు లక్ష్మి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details