తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితుల ఆందోళన - మణుగూరు తహసీల్దార్ కార్యాలయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూమికి న్యాయమైన పరిహారం చెల్లించడం లేదంటూ బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

btps railway land issues
btps railway land issues

By

Published : Jun 8, 2021, 12:00 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీటీపీఎస్ రైల్వే భూ నిర్వాసితుల చెక్కుల పంపిణీని వెంటనే నిలిపివేయాలంటూ బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరుతూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

భూమికి న్యాయమైన పరిహారం చెల్లించడం లేదని బాధిత రైతులు వాపోయారు. గ్రామ సభల్లో రైతుల ఆమోదం లేకుండానే తీర్మానం చేశారని ఆరోపించారు. రెండేళ్లుగా సర్వే పేరుతో కాలయాపన చేసి తీరా పరిహారం చెల్లించే విషయంలో అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గ్రామసభ నిర్వహించి న్యాయమైన పరిహారం చెల్లించని పక్షంలో భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details