తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతారామ కాలువ నిర్మాణ పనుల అడ్డగింత - farmers protest at seetarama works in badradri

సీతారామ కాలువ నిర్మాణం ద్వారా తమ పొలాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతోందని జూలూరుపాడు మండలం రామచంద్రాపురం రైతులు ఆందోళన చేపట్టారు. కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్​ చేశారు.

సీతారామ కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు
సీతారామ కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు

By

Published : Jan 31, 2020, 9:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రపురంలో రైతులు సీతారామ కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. వారి గ్రామ సమీపంలో కాలువ తవ్వకాలు చేపడుతుండగా తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు నచ్చజెప్పిన ససేమిరా అంటూ.. పని ప్రదేశంలోనే ధర్నాకు దిగారు. కాలువపై వంతెన లేకుంటే తమ పొలాలకు వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీతారామ కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు

For All Latest Updates

TAGGED:

seetharama

ABOUT THE AUTHOR

...view details