తెలంగాణ

telangana

ETV Bharat / state

'20 ఎకరాల భూమి... మూడేళ్లైనా పరిహారం ఇవ్వట్లేరు' - ANODLANA

ఓపెన్ కాస్ట్​ కోసం దాదాపు 20 ఎకరాల భూమి తీసుకున్న సింగరేణి అధికారులు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'20 ఎకరాల భూమి... మూడేళ్లైనా పరిహారం ఇవ్వట్లేరు'

By

Published : Jul 8, 2019, 2:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లించకుండానే మణుగూరు ఓపెన్ కాస్ట్ కోసం సింగరేణి భూములు తీసుకోవడాన్ని నిరసిస్తూ గనికి వెళ్లే రహదారిపై కర్షకులు సోమవారం ధర్నా నిర్వహించారు. మూడేళ్ల నుంచి పరిహారం కోసం నిరీక్షిస్తున్నా... అధికారులు పట్టించుకోకుండా భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి మూడుసార్లు ఆందోళన చేస్తే సర్వే చేసి న్యాయం చేస్తామని చెప్పిన సింగరేణి అధికారులు... రెవెన్యూ అధికారులపై నెట్టేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇప్పటికైనా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.

'20 ఎకరాల భూమి... మూడేళ్లైనా పరిహారం ఇవ్వట్లేరు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details