తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూమికి భూమి పరిహారం ఇవ్వాలి... ఆ తర్వాతే సీతమ్మ సాగర్ నిర్మాణం'

భూమికి భూమి పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని సీతమ్మ సాగర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవరపల్లి వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాతో సుమారు రెండు గంటలకు పైగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

farmers-demand-to-land-replace-of-seethamma-sagar-project-and-protest-at-devarapalli-in-bhadradri-kothagudem-district-news
'భూమికి భూమి పరిహారం ఇవ్వాలి... ఆ తర్వాతే సీతమ్మ సాగర్ నిర్మాణం'

By

Published : Mar 9, 2021, 4:55 PM IST

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో తమ భూములు ముంపునకు గురవుతున్నాయని... భూమికి భూమి పరిహారం ఇవ్వాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవరపల్లి వద్ద భూనిర్వాసితులు ధర్నాకి దిగారు.

దేవరపల్లి, గోగుబాక, మామిడిగూడెం, రాళ్లగూడెం, కుడునూరు తదితర గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో సుమారు రెండు గంటలకు పైగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:ములుగు జిల్లాలో చిరుత కలకలం.. భయం గుప్పిట్లో జనం

ABOUT THE AUTHOR

...view details