మణుగూరులో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల రహదారి సౌకర్యం లేకపోవడంపై రైతుల విజ్ఞప్తితో ఎమ్మెల్యే రేగా కాంతారావు జోక్యం చేసుకున్నారు. కొన్నాళ్లుగా దారి లేదని రైతులు కోరినా సింగరేణి అధికారులు నిరాకరించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సింగరేణి జీఎం దగ్గరికి వెళ్లి రహదారి ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఇప్పించారు. 500 ఎకరాల వ్యవసాయ భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు అనువైన మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు రైతులు ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
రహదారికి భూమి ఇప్పించిన ఎమ్మెల్యే..రైతుల హర్షం -
మణుగూరులో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ కేంద్రం నిర్మాణంతో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రహదారి లేకుండా పోయింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సింగరేణి జీఎం వద్దకు వెళ్లి రహదారికి కావల్సిన భూమిని రైతులకు ఇప్పించారు.
రహదారికి భూమి ఇప్పించిన ఎమ్మెల్యే..రైతుల హర్షం