తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారం కోసం రైతులు ధర్నా... 14 మంది అరెస్టు - Farmers agitation for Compensation in Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన 14మంది రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు గనికి వెళ్లే దారిలో వారికి ఇబ్బందులను సృష్టించారు. ఈ కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి స్టేషన్​కు తరలించారు.

పరిహారం కోసం రైతులు ధర్నా...14 మంది అరెస్టు

By

Published : Jul 8, 2019, 11:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పరిహారం చెల్లించాలని ధర్నా చేసిన 14 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజుపేట గ్రామం వద్ద గనికి వెళ్లే రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రహదారిపై చెట్లు వేసి రాకపోకలకు ఇబ్బందులు కల్గించారు. సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 14మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అధికారులు, రైతుల భిన్న వాదనలు

రైతుల ఆందోళన నేపథ్యంలో.. సింగరేణి, రెవెన్యూ అధికారులు రైతుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులకు అసలు భూమి లేదని సింగరేణి, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. తమ భూమిలోకి అధికారులు వచ్చి అబద్ధాలు చెప్తున్నారని రైతులు వాపోయారు. గతంలో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో భూమి మీద సర్వే చేసి పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అసలు భూమి తమది కాదని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టి రైతులను జైలుకు పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పరిహారం కోసం రైతులు ధర్నా...14 మంది అరెస్టు

ఇవీచూడండి:కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details