పోడు భూముల జోలికి వస్తే ఊరుకోబోమని గుండాల జడ్పీటీసీ రామక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సమావేశమైన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా పోడు భూముల వ్యవహారంపై ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
'పోడు'పై న్యూడెమోక్రసీ సమావేశం.. నేతల అరెస్టు - Gundala ZPTC ramakka Says on poddu lands
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసేందుకు.. ఇల్లందులో సమావేశమై చర్చించుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు.
'పోడు భూముల జోలికి వస్తే ఊరుకోం'
ఈ నేపథ్యంలో భూములకు పట్టాలు ఇవ్వాలని పలుచోట్ల పోడు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జడ్పీటీసీ రామక్క, సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు, సారంగపాణిలను తక్షణమే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు