భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన గిరిజన రైతు పొడియం రమేష్ దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లుపై భద్రాచలం ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న పట్టా భూమిలో తనను వ్యవసాయం చేసుకోవద్దని అడ్డుకుంటున్నారని రైతు ఫిర్యాదు చేశారు.
దుమ్ముగూడెం సీఐపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన గిరిజన రైతు - bhadradri kothagudem district news
తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిలో వ్యవసాయం చేసుకోవద్దని దుమ్ముగూడెం సీఐ అడ్డుకుంటున్నారని ఓ గిరిజన రైతు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
దుమ్ముగూడెం సీఐపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన గిరిజన రైతు
రెండు రోజుల నుంచి తన తండ్రిని, అన్నను, తనను పోలీస్ స్టేషన్కు పిలిపించి నిర్బంధించారని, బెదిరించి సంతకాలు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఏఎస్పీ ముందు వేడుకొన్నారు.
ఇవీ చూడండి: కాలుష్య కారాగారాలుగా మహానగర చెరువులు..!