ధాన్యం అమ్మేందుకు మార్కెట్ యార్డుకు వచ్చిన రైతు వడదెబ్బతో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో చోటుచేసుకుంది. సత్యంపేట గ్రామానికి చెందిన పునేం కృష్ణ అనే రైతు వారం రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోస్తున్నాడు.
రేపో మాపో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారని భావించిన కృష్ణ మధ్యాహ్నం సమయంలో మరోసారి ధాన్యం ఆరబోస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో కృష్ణ మృతి చెందాడు.
'ధాన్యం అమ్మేందుకు వచ్చి అనంతలోకాలకు' - sun stroke
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో పునేం కృష్ణ అనే రైతు వారం రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోస్తున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో మృతి చెందాడు.

వేసవి తీవ్రత బాగా ఉండటం వల్ల వడదెబ్బతో మృతి చెందిన రైతు
ధాన్యం ఆరబోస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన రైతు
ఇవీ చూడండి : 'భద్రత విషయంలో చింతించాల్సిన పనిలేదు'