వర్షం.. ఓ కుటుంబాన్ని నిరాశ్రయులను చేసింది. ఉన్న గూడు చెదిరిపోవడం వల్ల గుడిలో తలదాచుకుని సహాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రమాదేవి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి తమకు ఉన్న పెంకుటింట్లో జీవనం కొనసాగిస్తోంది. మంగళవారం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోతోందని ప్రాణాలతో బయటకు పరుగులు తీశారు.
వర్షానికి ఇల్లు నేల మట్టం.. గుడిలో తలదాచుకున్న కుటుంబం - family lost their home in illandu and waiting for help
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన రమాదేవి ఇల్లు వర్షానికి కూలిపోయింది. ఉన్న గూడు చెదిరిపోవడం వల్ల చేసేదేమీ లేక ఇద్దరు పిల్లలు, తల్లితో పాటు గుడిలో తలదాచుకున్నారు. ప్రభుత్వం విషయం తెలుసుకుని సహాయం చేస్తుందని ఎదురుచూస్తున్నారు.
ఇల్లందులో వర్షానికి కూలిపోయిన ఇల్లు
వర్షం వల్ల ఇల్లు కూలిపోవడం, సామాను పాడైపోవడం వల్ల కట్టుబట్టలతో ఇద్దరు పిల్లలు, తల్లిని తీసుకుని సమీపంలోని సాయిబాబా గుడిలో తలదాచుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు సహాయం చేయాలని బాధిత మహిళ కోరుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.