తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ కుటుంబానిది ఆత్మహత్యే.. ఆర్థిక ఇబ్బందులే కారణం!' - Family Committed Suicide with Financial Struggles

Family Committed Suicide with Financial Struggles: అందరూ అనుకున్నట్లు ఆ కుటుంబం గ్యాస్​ లీకై చనిపోలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. పిల్లలను అనాథలను చేయడం ఇష్టం లేక.. తమతో పాటే తీసుకువెళ్లాలని భావించిన ఆ తల్లిదండ్రులు.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న కూమార్తె తీవ్రగాయలతో బయటపడగా.. మిగిలిన ముగ్గురు తనువు చాలించారు. ఈ విషాద ఘటన భద్రాద్రిలోని పాత పాల్వంచలో చోటు చేసుకుంది.

Family Committed Suicide with Financial Struggles
పెట్రోల్ పోసుకుని కుటుంబం ఆత్మహత్య

By

Published : Jan 3, 2022, 1:00 PM IST

Family Committed Suicide with Financial Struggles: ఆర్థిక ఇబ్బందులు నిండుకుటుంబాన్ని బలి తీసుకున్నాయి. నలుగురిలో ముగ్గురు మృతి చెందగా.. చిన్న కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని కుటుంబానిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏసీపీ రోహిత్ రాజ్ వెల్లడించారు.

భద్రాద్రిలోని పాత పాల్వంచలో నాగరామకృష్ణ మీ సేవా కేంద్రాన్ని నడిపించే వాడు. ఇటీవలే మీ సేవా కేంద్రాన్ని ఇతరులకు లీజుకు ఇచ్చాడు. అనంతరం భార్య పిల్లలను తీసుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. రెండ్రోజుల క్రితమే కుటుంబం పాల్వంచ వచ్చింది. అప్పటినుంచి మదనపడిన దంపతులు చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పిల్లలు అనాథలు కాకుడదని వారిని చంపేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో కుమార్తె సాహిత్య సహా దంపతులు నాగరామకృష్ణ, శ్రీలక్ష్మీ మృతి చెందారు. మరో కుమార్తె సాహితి తీవ్రగాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ క్రమంలోనే పెట్రోల్​ పోసుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ రోహిత్ రాజ్ తెలిపారు. సూసైడ్​ నోట్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details