తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షంలోనూ కార్మికుల ధర్నా - ఐటీసి పేపర్ మిల్లు

వేతన సవరణ కోసం సారపాక ఐటీసీ పేపర్ మిల్లు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

భారీ వర్షంలోనూ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Aug 23, 2019, 11:53 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్ మిల్లులో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. 12వ వేతన ఒప్పందం ఆలస్యం కావడం వల్లే ధర్నా చేపట్టినట్లు కార్మికులు తెలిపారు. ఒకవైపు పేపర్ మిల్లు భారీ విస్తరణతో ముందుకెళ్తున్న క్రమంలో మరో వైపు కార్మికుల సంఖ్యను తగ్గించడం వల్ల పని భారం పెరుగుతోందన్నారు. ఈ ఒప్పందానికి చరమగీతం పాడాలంటూ పలు నినాదాలు చేశారు. భారీ వర్షంలో తడుస్తూనే అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

భారీ వర్షంలోనూ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఇవీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

ABOUT THE AUTHOR

...view details