తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి' - కొత్తగూడెం జిల్లా మణుగూరు

విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు సూచించారు. దానితోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగుతులను బాబురావు  ప్రారంభించారు.

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'

By

Published : Jun 29, 2019, 12:45 PM IST

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. శాస్త్రీయ విద్యతోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మతోన్మాదం పేరుతో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై దాడులు పెరిగియాని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details