తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారం పేరుతో పోడు రైతుల భూములను లాక్కుంటున్నారు'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేడికుంటను పోలీసులు, అటవీ శాఖ అధికారులు దిగ్బంధనం చేసి కందకం పనులు ప్రారంభించారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. హరితహారం పేరుతో పోడు రైతుల భూములను లాక్కుంటున్నారని అన్నారు.

ex mla gummadi narsaiah spoke on podu farmers problems in bhadradri kothagudem district
'హరితహారం పేరుతో పోడు రైతుల భూములను లాక్కుంటున్నారు'

By

Published : Jun 22, 2020, 12:24 AM IST

ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య రైతులను సంప్రదించకుండానే పోలీసు, అటవీశాఖ అధికారులు చెప్పినట్లుగా ప్రకటనలు చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మేడికుంటలో ఇటీవల పోడు భూములలో అటవీశాఖ అధికారులు కందకం పనులను ప్రారంభించారని తెలిపారు.

ప్రజాప్రతినిధులు కూడా పోడు రైతులను సంప్రదించకుండా అధికారులు చెప్పిన దానిని విని గ్రామంలో రైతుల ఇష్టపూర్తిగానే కందకం పనులు జరుగుతున్నాయని ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. హరితహారం పేరుతో పోడు రైతుల భూములను లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చండ్ర అరుణ, న్యూ డెమోక్రసీ నాయకులు నాయని రాజు పాల్గొన్నారు.


ఇవీ చూడండి: హైదరాబాద్ నుంచి కరోనా మందు.. వారంలో హెటిరో ద్వారా 'కొవిఫోర్'

ABOUT THE AUTHOR

...view details