తెలంగాణ

telangana

ETV Bharat / state

World Bicycle Day : సైకిల్​తో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి అనుబంధం - telangana news

ఒకసారి ఎమ్మెల్యే అయితేనే.. ఏళ్లకు సరిపడా సంపాదన.. తర్వాత తరాల కోసం ఆస్తులు కూడబెట్టడం.. పెద్దపెద్ద భవనాలు.. ఊరవతల ఫామ్​హౌస్​లు.. ఇంటి గ్యారేజ్​లో రకరకాల వాహనాలతో నాయకుల జీవనశైలే మారిపోతుంది. కానీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినా.. సైకిల్​ మీదే ప్రయాణం చేశారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆయనకు సైకిల్​తో ఉన్న అనుభవనాలను ఓసారి గుర్తుచేసుకుందాం.

World Bicycle Day, ex mla gummadi narsaiah
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సైకిల్​పై గుమ్మడి నర్సయ్య

By

Published : Jun 3, 2021, 10:35 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. సీపీఐ(ఎంఎల్​) న్యూ డెమోక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య. ఒక్కసారి రాజకీయ నేతగా ఎదిగితేనే నాయకుల జీవనశైలి మారిపోతుంది. అలాంటిది ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినా.. తన సాధారణ జీవితాన్ని వదిలేయలేదు.

సైకిల్​పై గుమ్మడి షికారు

ఎక్కడికి వెళ్లాలన్న ఈ మాజీ ఎమ్మెల్యే వాహనం.. సామాన్యుడి రథం సైకిలే. సైకిల్​ మీదే కిలోమీటర్ల కొద్ది ప్రయాణించి నియోజకవర్గ ప్రజల సాదకబాధకాలు తెలుసుకునే వారు. సైకిల్​పైనే పార్టీ సమావేశాలు, ప్రచారాలకు వెళ్లేవారు.

సైకిల్​తో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. నాలుగో సారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత.. పార్టీ నుంచి మోటార్ బైక్, జీపు వచ్చాయి. అయినా తనకు సైకిల్​పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ దాన్నే ఉపయోగించేవారు. 63 ఏళ్ల వయస్సులోనూ ఆయన.. అప్పుడప్పుడు సైకిల్​పైనే షికారుకు వెళ్తుంటారు.

సైకిల్​పై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

శారీరకంగా దృఢంగా ఉండేందుకు సైకిల్ పై ప్రయాణం ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి తెలిపారు. సైకిల్​.. రవాణాకు ఉప‌యోగక‌ర‌మే కాకుండా, ఇంధన ఆదాకు ఉప‌యుక్త‌మైన‌దని చెప్పారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం (World Bicycle Day) సందర్భంగా.. సైకిల్​ అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వీలైనంత వరకూ సైకిల్​పై వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details