షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు సరికాదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. కేసును న్యాయస్థానం పునఃసమీక్షించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.
'తీర్పు పునఃసమీక్ష కోసం రెండు ప్రభుత్వాలు కదలాలి' - ST EMPLOYMENT IN BADRADHRI KOTHAGUDEM DISTRICT
షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేసును న్యాయస్థానం పునఃసమీక్షించాలని ఆయన కోరారు.
పునఃసమీక్ష కోసం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి : గుమ్మడి
న్యాయస్థానాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే షెడ్యూల్ తెగల వారికి అన్యాయం చేసేలా తీర్పు రావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారని ఆన్నారు. మరోవైపు పోడు భూముల సమస్య సైతం ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.