మాజీ ఎమ్మెల్యే కాశయ్య కన్నుమూత... సీఎం కేసీఆర్ సంతాపం - కొత్తగూడెం వార్తలు

08:21 May 25
మాజీ ఎమ్మెల్యే కాశయ్య కన్నుమూత... సీఎం కేసీఆర్ సంతాపం
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాశయ్య మృతి చెందారు. కాశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ నేత కాశయ్య అని సీఎం కొనియాడారు.
రాష్ట్రం సీనియర్ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశయ్య కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు.