తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీలు ఉద్యమించాలి: మిడియం బాబురావు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

మనుగడకై ఆదివాసీలు ఉద్యమించాలని మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహాసభలో పాల్గొన్నారు.

ex midium babu rao speak about tribals in badradri kothagudem district
ఆదివాసీలు ఉద్యమించాలి: మిడియం బాబురావు

By

Published : Mar 18, 2021, 10:55 AM IST

కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాల వల్ల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఎంపీ, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షడు మిడియం బాబురావు అన్నారు. ఆదివాసీలు తమ మనుగడకై ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహాసభలో ఆయన పాల్గొన్నారు.

ఆదివాసీల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయని చెప్పారు. వారి హక్కులు హరిస్తున్నారని.. చట్టాలను నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను పోడు వ్యవసాయం, ఉపాధి, విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:'రాత్రి 10 గంటలకు వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు!'

ABOUT THE AUTHOR

...view details