భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏరువాక పున్నమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం రోజున వేడుకలకు అంకురార్పణ చేసిన అర్చకులు గురువారం నాడు అభిషేక మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏరువాక పున్నమి - eruvaka punnami celebrations in bhadradri temple
భద్రాద్రి రాముడి సన్నిధిలో ఏరువాక పున్నమి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. లక్ష్మణసమేతసీతారాములకు అర్చకులు వైభవంగా అభిషేకం జరిపారు. గంధోదకములు, హరిద్రా చూర్ణములు, సమస్త నదీ జలాలతో తిరుమంజనం నిర్వహించారు.
ప్రధానాలయంలోని సీతారామ ఉత్సవమూర్తులను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి.. స్నపన తిరుమంజనం జరిపారు. పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార ద్రవ్యాలతో పంచామృతం తయారు చేసి అభిషేకం చేశారు. తొమ్మిది రకాల పళ్ల రసాలతో స్వామిని అభిషేకించారు. తదుపరి.. గంధోదకములు, హరిద్రా చూర్ణములు, సమస్త నదీ జలాలతో తిరుమంజనం నిర్వహించారు.
వేయి దారాలతో మహాకుంభ ప్రోక్షణ చేసి.. వేదిపండితుల మంత్రోచ్ఛరణల మధ్య 82 కలశాలతో లక్ష్మణసమేత సీతారాములకు అంగరంగవైభవంగా అభిషేకం జరిపారు. ఆలయ అర్చకులు స్వామివారికి ద్వాదశ ధ్వజ హారతులిచ్చారు. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ప్రతిఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు స్తల సాయి తెలిపారు.
- ఇదీ చదవండి :ఏరువాక పున్నమికి శ్రీకారం చుట్టనున్న రైతులు