రాబోవు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు నీటి నిల్వలు,పరిసరాల పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరారు. జిల్లాలోని టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో పర్యటించిన ఆయన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని మురుగునీరు లేకుండా చూసుకోవాలని గ్రామస్తులకు వివరించారు.
గ్రామంలో దోమల నివారణ వ్యాప్తి నిరోధానికి చేస్తున్న రసాయనాల పిచికారి పనులను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
'సీజనల్ వ్యాధులు రాకుండా.. పరిసరాల్లో ఇలా చేయండి ' - prevent diseases in bhadradri
వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య కోరారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
'వ్యాధులు రాకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలి'
ఇదీ చదవండి:'కష్టాల సంద్రాన్ని... కన్నీళ్లతో ఈదలేకున్నాం