భారత ఆహార సంస్థ, ఉమ్మడి ఏపీ పౌర సరఫరాల సంస్థను మోసం చేశారన్న కేసులో బియ్యం వ్యాపారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన శ్రీ సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీ భాగస్వామి సీమకుర్తి నరసింహారావుకు చెందిన రూ.1.67 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ED: బియ్యం వ్యాపారి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ - ed attached rice trader's assets
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ బియ్యం వ్యాపారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పౌర సరఫరాల సంస్థను మోసగించిన కేసులో రూ.1.67 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది.
ధాన్యాన్ని ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు అమ్మినట్లు బిల్లులు సృష్టించి బయట మార్కెట్‌లో విక్రయించి సుమారు 1.95 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు సీమకుర్తి నరసింహారావుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు గతంలో ఖమ్మం జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. సీమకుర్తి నర్సింహారావు మోసం ద్వారా సంపాదించిన సొమ్ములో రూ.90 లక్షలు బ్యాంకు రుణాన్ని చెల్లించినట్లు గుర్తించింది. మూడు స్థిరాస్తులు సహా రూ.1.67 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఇదీ చూడండి: super spreaders: పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్ డ్రైవ్
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు