భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పర్యటించారు. ఏప్రిల్ 2న జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు షురూ
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాటుల ముమ్మరం చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ పర్యటించి, సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు షురూ
వేసివి కాలం కావడం వల్ల కల్యాణ మండపంలో ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, వసతి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి కల్యాణ తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాన్ని ఎక్కువ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణోత్సవం జరిగే మిథిలా ప్రాంగణంలో తాత్కాలిక చలువ పందిళ్లు కాకుండా శాశ్వత షెడ్డు నిర్మాణానికి ఆలోచించాలని సూచించారు.