భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మిలీషియా సభ్యుడు మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గుంటూరు రవిగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో మణుగూరు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలానికి చేరుకుని మణుగూరు డీఎస్పీ సాయిబాబా, తహసీల్దార్ మనగిలాల్ పంచనామా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ - badradri kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
encounter
మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం గుత్తి కోయ గ్రామాల్లో దళం తిరుగుతోందని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు తారసపడి కాల్పులు జరిపినట్లు చెప్పారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Last Updated : Aug 21, 2019, 3:27 PM IST