తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమే! - employment guarantee works not done well at illandu in bhadradri district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23 మండలాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా.. పలు చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపానికి గురై పనులు నామమాత్రంగానే సాగుతున్నాయి. దీనిపై డీఆర్​డీ అధికారిని వివరణ కోరగా.. ఉపాధి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

employment guarantee works not done  well at illandu in bhadradri district
ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమే!

By

Published : Jun 27, 2020, 12:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23 మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో జరుగుతున్న పనులు అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శంగా నిలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొలతలు, మీటర్ల వెడల్పు, మీటర్ల పొడవుతో మట్టి తీయాల్సి ఉండగా.. పని జరిగే సమయంలో క్షేత్రస్థాయిలో సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణ లోక పనులు మొక్కుబడిగా జరిపి మమా అనిపిస్తున్నారు.

నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం

ఉపాధి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని.. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఏపీవో పరిశీలన చేస్తున్నారని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు... సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కూలీలు పనులు చేస్తున్నారని డీఆర్​డీ అధికారి మధుసూదన్​రాజు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details