భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు సీఐ రమేశ్ దుప్పట్ల పంపిణీ చేశారు. మారుమూల గ్రామాలైన దండగుండాల, చేపలవారిగుంపులో పేదలకు దుప్పట్లు అందించి.. తన సేవ గుణాన్ని చాటుకున్నారు.
అనాథలకు ఆహన్నహస్తం సీఐ రమేశ్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
అతనో పోలీసు అధికారి.. శాంతి భద్రతల నిర్వహణతోపాటు సామాజిక సేవలోనూ ముందున్నారు. కఠినంగా వ్యవహించడమే కాదు.. మంచి మనసుతో సాయం చేస్తున్నారు. ఆయనే సీఐ బరపటి రమేశ్. గ్రామీణ ప్రాంత పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు.
అనాథలు, పేదలకు దుప్పట్లు పంచిన సీఐ రమేశ్
హనుమంతులపాడులోని అనాథ ఆశ్రమ చిన్నారులకు దుప్పట్లు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. నిత్యం శాంతిభద్రతలే కాకుండా సామాజిక దృక్పథంతో పేదలకు సాయం చేస్తున్న సీఐ రమేశ్‌ను స్థానికులు కొనియాడారు. ఇలాంటి సేవాలు చేస్తూ మంచి కిర్తీ పొందాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:మద్యం మత్తు.. మామపై కోపం... కన్నకొడుకునే చంపేసింది!