భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ప్రభుత్వ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో 'ఓటరు చైతన్య స్ఫూర్తి' కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలపై యువత అవగాహన కలిగి ఉండాలని ఎన్ఎస్ఎస్ అధ్యాపకులు జాన్ సూచించారు. సామాజిక దృక్పథం గల వారిని ఎన్నుకోవాలని కోరారు. గత పురపాలక ఎన్నికల్లో ఇల్లందులో కేవలం ఒక్క ఓటుతో అభ్యర్థి గెలిచిన సందర్భం ఉందని... కాబట్టి ప్రతి ఓటు కీలకమైనదని ఉపాధ్యాయులు రాము తెలిపారు. యువత ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
'సామాజిక దృక్పథం గల వారిని ఓటు వేసి ఎన్నుకోండి' - eenadu vote awareness camp
యువతకు ఓటుపై అవగాహన కల్పిస్తూ ఇల్లందులోని ప్రభుత్వ కళాశాలలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.

'సామాజిక దృక్పథం గల వారిని ఓటు వేసి ఎన్నుకోండి'
TAGGED:
eenadu vote awareness camp