తెలంగాణ

telangana

ETV Bharat / state

రాములోరి ఆలయంలో పనిచేయని లిఫ్ట్ - For devotees who cannot walk, the lift arranged for the elderly is not working

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నడవలేని భక్తులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో దర్శనం కోసం వచ్చిన వికలాంగులు, వృద్ధులు నానా తంటాలు పడుతున్నారు.

రాములోరి ఆలయంలో పనిచేయని లిఫ్ట్

By

Published : Nov 1, 2019, 3:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నడవలేని భక్తులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పని చేయడం లేదు. దూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. అలా వచ్చిన వృద్ధులను సైకిళ్లతో సహా మెట్లపై మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

గత రెండు రోజుల నుంచి లిఫ్ట్ బాగు చేయక పోవడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని లిఫ్ట్ బాగుచేయించాలని భక్తులు కోరుతున్నారు.

రాములోరి ఆలయంలో పనిచేయని లిఫ్ట్

ఇదీ చూడండి : గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం

ABOUT THE AUTHOR

...view details