భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ముందుగా హోమశాలలో ఉన్న గరుడ పటాన్ని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ వేద పఠనం చేశారు.
రామయ్య సన్నిధిలో ధ్వజారోహణ ఉత్సవం - తెలంగాణ వార్తలు
రామయ్య సన్నిధిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ వేడుకల ప్రాధాన్యాన్ని పండితులు వివరించారు.
![రామయ్య సన్నిధిలో ధ్వజారోహణ ఉత్సవం bhadrachalam dwajarohanam, dwajarohanam in seetharamula swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11458557-thumbnail-3x2-bhadrachalam---copy.jpg)
సీతారాముల ఆలయంలో ధ్వజారోహణం, సీతారాముల కల్యాణం
ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయని పండితులు తెలిపారు. గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఇవాళ ఉదయం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ వైదిక పెద్దలతో పాటు ఈవో శివాజీ, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.