లాక్డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు ఓ యాచకురాలు అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యాచకురాలు దుర్గా భవాని.. అన్నదానం చేసి తన గొప్ప మనసు చాటుకుంది. వినాయకపురంలోని చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద.. జాతరలో జైంట్ వీల్ ప్రదర్శన కోసం మహారాష్ట్ర నుంచి 45 మంది వలస కూలీలు రెండు నెలల క్రితం వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా నిలిచిపోవడం వల్ల వారు ఇక్కడే చిక్కుకుపోయారు.
సొంత ఖర్చులతో భోజనం