తెలంగాణ

telangana

ETV Bharat / state

దుమ్ముగూడెం సీఐపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సీఐపై నర్సాపురానికి చెందిన ఓ రైతు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వినీల్ రైతు. అక్రమ కేసులు బనాయించడం సరికాదని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్రకు ఫిర్యాదు చేశారు.

దుమ్ముగూడెం సీఐపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతు
దుమ్ముగూడెం సీఐపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతు

By

Published : Aug 6, 2020, 4:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సీఐపై నర్సాపురానికి చెందిన ఓ రైతు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వినీల్ రైతు. తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల 2న దుమ్ముగూడెం సీఐ రైతుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గడ్డిని చంపడానికి వాడే మందు నిల్వ ఉందని సోదాలు చేశారు. కానీ ఆ రోజు ఎవరి ఇంట్లోనూ.. గడ్డి మందు దొరకలేదు. తర్వాత రోజు కొందరు రైతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి గడ్డి మందు వాడుతున్నారని ఇతరులకు అమ్ముతున్నారని ఒప్పించే ప్రయత్నం చేశారు.

ఈనెల 2న చేసిన సోదాల్లో వినీల్ అనే రైతు దగ్గర గడ్డి మందు దొరకకపోయినా దొరికినట్లు అక్రమ కేసు బనాయించారని నర్సాపురం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించడం సరికాదని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్రకు ఫిర్యాదు చేశారు. దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details